కొత్త కారు కొన్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్..!

జశ్వంత్ షణ్ముఖ్ యూట్యూబ్ సెన్సేషన్.. యూట్యూబ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు ఇతని గురించి తెలియని వారుండరేమో.. యూట్యూబ్ లో ఇతని వెబ్ సిరీస్ లు ట్రెండింగ్ లో ఉంటాయి.  షణ్ముఖ్ యూట్యూబ్ లోనే కాదు అప్పుడప్పుడు టీవీ షోలలో ప్రసారమయ్యే ఈవెంట్లలో డ్యాన్స్ చేస్తుంటాడు. 

కానీ షణ్ముఖ్ ఇటీవల అనుకోని సంఘటనతో వార్తల్లో నిలిచాడు. మద్యం సేవించిన కారు నడిపిన కేసుతో అతని ఇమేజ్ దెబ్బతింది. అయితే షణ్ముఖ్ నటించిన కొత్త వెబ్ సిరీస్ సూర్య అతనికి మళ్లీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. సూర్య వెబ్ సిరీస్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది.

తాజాగా షణ్ముఖ్ ఓ కొత్త కారు కొన్నాడు. దాని ముందు నిల్చున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఇది నేను హాయ్, ఇది నా కొత్త కార్ హాయ్, ఇంకా పార్టీలు లేవు హాయ్, త్వరలో డ్రైవర్ ని కూడా పెట్టుకుంటున్న హాయ్’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ పై నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. ఈసారైనా మద్యం సేవించకుండా కారు నడుపు అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

 

View this post on Instagram

 

A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)

Leave a Comment