యూట్యూబ్ ఓ పేద యువకుడి జీవితాన్ని మార్చేసింది..!

కరోనా మహమ్మారి ఓ గిరిజన యువకుడి ఉపాధిని దెబ్బతీసింది. దీంతో అతడి కుటుంబం రోడ్డున పడింది. అయితే యూట్యూబ్ ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ లో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. కరోనాతో ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న చాలా మందికి ఆ యువకుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు..

ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన గిరిజన యువకుడు ఇసాక్ ముండా. ఒకప్పుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డైన్ వల్ల అతడు తన ఉపాధి కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబం రోడ్డున పడింది. ఏంచేయాలో తోచని పరిస్థతి.. ఆ సమయంలో తన స్నేహితుడి ఫోన్ లో యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగర్ కు సంబంధించిన వీడియోలు చేసేవాడు. 

ఈక్రమంలో ఆ ఫుడ్ బ్లాగర్ ను ప్రేరణగా తీసుకున్నాడు. తాను యూట్యూబ్ లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. వీడియోలు తీసేందుకు రూ.3 వేలు అప్పు తీసుకుని స్మార్ట్ ఫోన్ కొన్నాడు. తాను తీసుకునే ఆహారాన్ని తన మొదటి వీడియోగా చేశాడు. ఒక ప్లేట్ లో అన్నం, పచ్చి టమాటో, పచ్చి మిర్చి కలిపి తింటున్న వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. అంతే ఆ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 

అలా ముండా తన యూట్యూబ్ చానల్ లో వీడియోలు పెడుతూ నెలకు రూ.5 లక్షలకు పై గా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం తన చానల్ కు 7 లక్షలకు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు. కాగా తన లక్ష్యం యూట్యూబ్ వీడియోల నుంచి డబ్బు సంపాదించడం కాదని, తమ సంప్రదాయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలనుకుంటున్నానని ముండా తెలిపాడు. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో తన తల్లిదండ్రులకు ఇల్లు కట్టానని చెప్పాడు. తన వీడియోలు వీక్షిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

 

Leave a Comment