27 ఏళ్లకే గుండెపోటు..యంగ్ యూట్యూబర్ మృతి..!

యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కేవలం 27 సంవత్సరాల వయస్సులో ఆమెకు గుండెపోటు రావడం అందరినీ కలిచివేస్తోంది. శ్రియా మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రియ మురళీధర్ మృతి పట్ల పలువురు సెలబ్రెటీలు సంతాపం తెలుపుతున్నారు. 

శ్రియ మురళీధర్ స్వస్థలం హైదరాబాద్ లోని లక్డీకాపూల్.. ఆమెకు నటన అంటే ఎంతో ఇష్టం.. యాంకర్ ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ కంటెస్టెంట్ గా పాల్గొంది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2 లోనూ నటించింది. అనంతరం యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  

 

Leave a Comment