పోలీసులకు ఎదురుతిరిగిన యువతి.. కొట్టిన పోలీసులు.. వీడియో వైరల్..

వాహనాల తనిఖీ విషయంలో ఓ యువతి పోలీసులకే ఎదురుతిరగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో అక్కడ ఉన్న మహిళ ఎస్సై ఆ యువతి చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటన కార్ణాటకలోని మండ్య నగరంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాలు మేరకు.. మండ్య నగరంలోని నోరడి రోడ్డు కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ యువతి స్కూటీని రాంగ్ పార్కింగ్ చేసింది. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి స్కూటీని లాక్ చేసి పక్కన పెట్టారు. అదే సమయంలో ఆక్కడికి వచ్చిన యువతిని రికార్డులు చూపించాలని అడిగారు. 

అయితే తన వద్ద డబ్బులు లేవని, డబ్బులు గూగుల్ పేలో పంపిస్తానని, మీ నంబర్ ఇవ్వాలని ఆ యువతి పోలీసులను అడిగింది. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. మొదట బండి దిగు, నీ పేరు, మీ నాన్ని పేరు చెప్పు, మీ నాన్నను పోలీస్ స్టేషన్ కు పంపు, అక్కడ బండి ఇస్తాము అని చెప్పారు. దీంతో ఆ యువతి కోపంతో రగిలిపోయింది. 

తన బండి ముట్టుకోవద్దని పోలీసులపై గట్టిగా అరిచింది. వారితో వాగ్వాదానికి దిగింది. దీంతో అక్కడ ఉన్న మహిళా ఎస్సై కవితా పాటిట్ వచ్చి పోలీసులనే బెదిరిస్తావా అంటూ ఆ యువతి చెంప చెళ్లుమనిపించింది. దీంతో రెచ్చిపోయిన ఆ యువతి నన్ను కొట్టడానికి నీకేం హక్కు ఉంది.. ఎనె మాడ్తియా రాస్కెల్ అంటూ గోల చేసింది. పోలీసులు ఆ యువతి స్కూటీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  

 

Leave a Comment