ప్రేమ పేరుతో మోసం.. సెల్పీ తీసుకుంటూ శానిటైజర్ తాగిన యువతి..!

ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈక్రమంలో ఇద్దరు శారీరకంగా కలిశారు. మోజు తీరాక యువకుడు ఆ యువతిని దూరం పెట్టాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ శానిటైజర్ తాగింది. తన చావుకు బాధ్యులైన వారిని ఎవరినీ వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్ కూడా రాసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో చోటుచేసుకుంది. 

రావినూతల గ్రామానికి చెందిన వేణు, సింధూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు. దీంతో వేణు తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోలేదు. ఇక వేణు మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పి సింధూను శారీరకంగా వాడుకున్నాడు. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి తమ తల్లిదండ్రులు అంగీకరించడం లేదంటూ మొహం చాటేశాడు. 

దీంతో సింధూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని సూసైడ్ నోట్ లో రాసింది. గతంలో రెండు సార్లు వేణు ఇంటి ముందు ఆందోళనకు దిగినా కూడా తనకు న్యాయం జరగలేదని, వేణు తల్లిదండ్రులు తనకు బూతులు తిట్టారని సింధూ పేర్కొంది. తనలా ఏ అమ్మాయికి కూడా అన్యాయం జరగకూడదని చెబుతూ సింధూ సెల్పీ తీసుకొని శానిటైజర్ తాగింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

Leave a Comment