పులిని పాడటం ఎప్పుడైన చూశారా?.. వీడియో వైరల్..

పులి గాండ్రించడమే మీరు చూసింటారు. కానీ పులిని పాడటం ఎప్పుడైనా చూశారా? పులి పాడటం ఏంటని అనుకుంటున్నారా? అవునండి రష్యాలోని ఓ జూలో పులి అరుపులు పాడుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఆ పులి రాగం విన్న సందర్శకులు ఆశ్యర్యపోతున్నారు. 

సైబీరియన్ నగరంలోని బర్నాల్ లో లెస్నాయ స్కజ్కా పేరుతో ఒక జూ ఉంది. అక్కడ బగీరా అనే ఆడపులి 2020 జూన్ లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అముర్ అనే ఎనిమిది నెలల పులి పిల్ల ఇటీవల వింతగా గాండ్రిస్తోంది. దాని అరుపు పాడుతున్నట్లుగా చాలా శ్రావ్యంగా ఉంది. 

ఈ విషయం తెలుసుకున్న జూ సిబ్బంది ఆశ్యర్యపోయారు. ఆ పులి గొంతుకు ఏమైనా గాయం అయిందా అని పరిశీలించారు. అయితే ఆ పులి ఆరోగ్యంగానే ఉంది. కేవలం అది తన తల్లిని ఆకట్టుకునేందుకు ఆ విధంగా శ్రావ్యంగా అరుస్తుందని జూ సిబ్బంది గ్రహించారు. ప్రస్తుతం పాడుతున్నట్లుగా కూనిరాగం తీస్తున్నా ఆ పులి అరుపు వీడియో వైరల్ గా మారింది. 

Leave a Comment