సోనూసూద్ కోసం యువకుడి పాదయాత్ర..!

రీల్ లైఫ్ లో విలనే అయినా కరోనా కష్టాల బాధితులను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్..ఇప్పుడాయన ఈమేజ్ హీరోల స్థాయికి వెళ్లిపోయింది. యూత్ అంతా రియల్ హీరో అని కీర్తిస్తోంది. కొందరికి రీల్ హీరోలు గొప్పోళ్లు అయితే.. తనకు ఈ రియల్ హీరో గొప్ప అంటున్నాడు ఈ యువకుడు. అతనే దేవుడంటూ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర మొదలు పెట్టాడు..

వికారాబాద్ జిల్లా, దోమ మండలం, దోర్నాలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ ఇంటర్ చదువుతున్నాడు. సోనూసూద్ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితుడై ఆయన్ను కలిసి తనగోడు వినిపంచుకునేందుకు ముంబై బయలుదేరాడు. 

సోనూసూద్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దేశం మొత్తానికి సాయం చేసిన ఆయన తనకు దేవుడితో సమానమని చెప్పుకొచ్చాడు. ఆ దేవుడి దగ్గరకు వెళ్లాలని సంకల్పించానని తెలిపాడు. ఆయనను కలిసి మాట్లాడితే తన జన్మ ధన్యమవుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు. తాను పాదయాత్ర చేపడతానని అనగానే తన తల్లిదండ్రులు భయపడ్డారని, కానీ తర్వాత ఒప్పుకున్నారని చెప్పాడు. ఈ పాదయాత్రలో భాగంగా రోజూ 40 కిలోమీటర్లు నడుస్తున్నానని, రాత్రి ఎక్కడో చోట నిద్రిస్తున్నానని తెలిపాడు. సోనూసూద్ ఫొటో చూసి చాలా మంది తనకు సాయం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. 

 

Leave a Comment