జీవా ధోనిపై అసభ్యకర కామెంట్స్ చేసిన యువకుడు అరెస్ట్..

మహేంద్ర సింగ్ ధోని కూతురు జీవా ధోనిపై 16 ఏళ్ల బాలుడు అసభ్యకర కామెంట్లు చేశాడు. ఆ బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలుడు గుజరాత్ లోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించిన రాంచీ పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో బాలుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని రాంచీ పోలీసులకు అప్పగిస్తామని కచ్ జిల్లా ఎస్పీ సౌరభ్ సింగ్ తెలిపారు. 

 వివరాలు.. ఐపీఎల్ 13వ సీజన్ లో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో ధోని సరిగ్గా ఆడలేదు. అయితే ధోని ఆడకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని, మళ్లీ సరిగ్గా ఆడకపోతే జీవా ధోనిపై అత్యాచారం చేస్తానని ఓ 16 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపింది. పలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు దీన్ని ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

 

Leave a Comment