కోవిడ్ రోగులకు సేవలందిస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన యువ వైద్యరాలు..!

ఆమె ఓ యువ డాక్టర్.. ఎన్నో ఆశలతో వైద్య వృత్తిలోకి అడుగుపెట్టింది. కరోనా రోగులకు ధైర్యంగా నిలిచింది. వారిలో కొండంత భరోసాను నింపింది. కానీ అంతలోనే ఆమె కరోనా రక్కసికి గురై కనుమరుగైపోయింది. మూడు పదులు నిండకుండానే తిరిగిరాని లోకాలకు చేరుకుంది. కోవిడ్ రోగులకు సేవలందిస్తూ అనారోగ్యం బారిన పడి తనువు చాలించింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో చోటుచేసుకుంది.  

మండలంలోని మోరి గ్రామానికి చెందిన కందికట్ల రోజీ ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆశ్రంలోనే శిక్షణ పొందుతోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏలూరు ఆశ్రం కోవిడ్ హాస్పిటల్ లో కరోనా రోగులకు సేవలందించింది. రోగులకు చికిత్స చేసే క్రమంలో అనారోగ్యానికి గురైంది. దీంతో స్వగ్రామం చేరుకుంది. సోమవారం గ్రామంలోని సుబ్బమ్మ కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్ లో వైద్య చికిత్స కోసం చేరింది. పరిస్థితి విషమించడంతో మంగళవారం మరణించింది.  

Leave a Comment