యూజర్లకు యూట్యూబ్ షాక్.. ఇక నుంచి డబ్బులు కట్టాలి..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదైనా సమాచారం కావాలంటే యూట్యూబ్ నే ఫాలో అవుతున్నారు. ఏం కావాలన్నా యూట్యూబ్ లోనే సెర్చ్ చేస్తున్నారు. ఇక మనకు బోర్ కొట్టిందంటే చాలు యూట్యూబ్ లో పాటలు, మనకిష్టమైన వీడియోలు చూస్తుంటాం.. అయితే నెట్ వర్క్ సరిగ్గా అందక.. డేటా స్పీడ్ లో సమస్యలు ఉన్నప్పుడు మంచి వీడియోలను ఆఫ్ లైన్ మోడ్ లో వీడియోలు డౌన్ లోడ్ చేసుకుంటారు. తీరిక ఉన్నప్పుడు ఆ వీడియోలను చూస్తుంటారు. 

ఇలా ఆఫ్ లైన్ లో వీడియోలు డౌన్ లోడ్ చేసుకునే వారికి యూట్యూబ్ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా చూసిన వీడియోలను ఇకపై డబ్బులు చెల్లించాలని నిబంధన పెట్టింది. ఇప్పటికే యూట్యూబ్ లో వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి. వీడియోల్లో యాడ్స్ రాకుండా ఉండాలంటే పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇకపై డౌన్ లోడ్ చేసుకున్న వీడియోలకు కూడా డబ్బులు కట్టాలని యూట్యూబ్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అయితే లో, మీడియం క్వాలిటీ వీడియోలు ఫ్రీగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కేవలం హై, ఫుల్ హెచ్డీకి సంబంధించిన వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవాలంటే మాత్రం డబ్బులు కట్టాలి అంటూ సూచించింది. యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల చాలా మంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 

Leave a Comment