పబ్జీని బ్యాన్ చేసిన ఆడొచ్చు..!

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ చైనాకు సంబంధించిన 118 యాప్లను నిషేధించింది. ఇందులో ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ కూడా ఉంది. అయితే పబ్జీ గేమ్ ను బ్యాన్ చేసినా ఆడొచ్చు. ఎలా అంటే పబ్జీ గేమ్ ను మొదట సౌత్ కొరియా తయారు చేసింది. దీనిన డెస్క్ టాప్ వర్షన్ లో ఆడవచ్చు. తర్వాత చైనా ఈ గేమ్ కు సంబంధించిన లైసెన్స్ ను సౌత్ కొరియా నుంచి పొందింది.

ఆ సమయంలో చైనా కంపెనీ టెన్ సెన్ట్ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ యాప్ లను తీసుకొచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం బుధవారం పబ్జీ మొబైల్ యాప్ ను నిషేధించింది. అయితే ఇండియాలో డెస్క్ టాప్ గేమ్ ను ఆడొచ్చు. డెస్క్ టాప్ మోడ్ ను సౌత్ కొరియా రూపొందించింది. కాబట్టి దానిని ఇండియాలో బ్యాన్ చేసే అవకాశం లేదు. అయితే పబ్జీ యాప్లను మాత్రం గూల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తారు.  

Leave a Comment