సంతానోత్పత్తి లేదని చింతిస్తున్నారా..ఈ డైట్ ని ఫాలో అవ్వండి..!

పెళ్లి అయినా వెంటనే చాలా మంది దంపతులు పిల్లలు కోసం ఎన్నో దేవాలయాలు చుట్టు, హాస్పిటల్ చుట్టు తిరుగుతూ ఉంటారు. అలా గర్భము గురించి ప్రయత్నం చేసే మహిళలు తప్పినిసరిగా  తీసుకోవాల్సిన ఆహారంపై అధ్యయనం చేశారు హార్వర్డ్ టీహెచ్, చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ కు చెందిన పరిశోధకులు. సహజంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న మహిళలు విటమిన్లు, ఖనిజ లవణాలు తప్పనిసరిగా తమ ఆహారంలో చేర్చాలని వారు చెపుతున్నారు. 

ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం భోజనంలో మూడు పోషకాలను తప్పనిసరిగా చేర్చాలి అని పరిశోధనలు చెపుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు ఆరోగ్యకరమైన రీతిలో గర్భధారణ అవకాశాలను పెంచడంలో ఆహారం గొప్ప పాత్ర పోషిస్తుంది. విటమిన్ బీ12 మన శరీరానికి చాలా అవసరము. 

ఈ విటమిన్‌ కి కోబాలమిన్ అని కూడా ఉంది. ఇది రక్తం తయారు అవ్వడానికి, నాడీ వ్యవస్థ మంచిగా పనిచేయడానికి అవసరమైన  విటమిన్. బీ12 నీటిలో కరుగుతుంది. ఈ విటమిన్ మన శరీరానికి ఎంతో ఉపయోగము అయినా మన శరీరము లో ఇది ఉత్పత్తి కాదు.అందువలన ఈ విటమిన్ కోసం ఆహార పదార్థాలు మీద ఆధార పడాలిసి వస్తుంది. ముఖ్యంగా శాకాహారుల్లో 80 నుంచి 90 శాతం వరకు విటమిన్ బీ12 లోపం ఉన్నట్లు చాలా అధ్యయనాలు చెపుతున్నాయి. అందువలన శాకాహారులు  తప్పనిసరిగా ఈ పోషకాన్ని ఆహారంలో జాత చేసుకోవాలి.ఈ విటమిన్ ఎక్కువగా పాల పదార్థాలు, చేపలు, గుడ్లలో  విరివిగా  దొరుకుతుంది.

విటమిన్ బీ9ని ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఎర్ర రక్త కణాలను తయారు అవ్వడానికి , రోగనిరోధక శక్తిని వృధి చెయ్యడానికి, అలసట శరీరానికి  తెలియకుండా ఉండడానికి ఈ విటమిన్ అవసరం.ఈ విటమిన్ తక్కువ అవ్వడము వల్ల,పుట్టుకతో వచ్చే లోపాలతో పాటు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.ఆహారం నుంచి లభించే ఈ విటమిన్ రూపాన్ని ఫోలేట్ అని అంటారు. బచ్చలికూర, బ్రకోలీ, పాలకూర, బీన్స్, బఠానీలు,  నిమ్మకాయలు, అరటిపండ్లు, పుచ్చకాయలు లాంటి పదార్థాల నుంచి ఈ విటమిన్ దొరుకుతుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్‌ఫ్లమేషన్‌  తగ్గడానికి, రక్తపోటు తగ్గడానికి ,ఉపయోగపడుతుంది. గర్భిణులు, శిశువులకు  అవసరం. కంటి చూపు అభివృద్ధిలో దోహద పడుతుంది. ఒమేగా-3 ఎక్కువగా చేపలు, గింజలు, విత్తనాలు, మొక్కల నూనెలో బాగా ఉంటాయి. అధ్యయనం ప్రకారము యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ డీ, పాల ఉత్పత్తులు, సోయా, కెఫిన్, ఆల్కహాల్ సంతానోత్పత్తిపై తక్కువ ప్రభావం చూపుతాయని హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం చెప్పారు. అయితే ప్రాసెస్ చేసిన మాంసం, మిఠాయిలు, ఫిజీ డ్రింక్స్ లాంటి ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం ద్వారా గర్భధారణపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు.

 

Leave a Comment