38 భార్యల ముద్దుల మొగుడు ఇక లేడు..!

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ యజమాని జియోనా చానా కన్నుమూశారు. మిజోరం రాష్ట్రానికి చెందిన ఆయన వయసు 76 ఏళ్లు. 17 ఏటే వివాహం చేసుకున్న ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వీరి కుటుంబంలో మొత్తం 178 మంది సభ్యులు ఉంటారు.  

జియోనా చానా ఆదివారం మిజోరంలో మరణించారు. ఆయన మృతికి రాష్ట్ర సీఎం జొరాంతాంగా ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిజోరాం వాసి మిస్టర్ జియోన్ కు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నానని పేర్కొన్నారు. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు. ఆయన గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతో పాటు మిజోరాంకు కూడా అనేక మంది పర్యాటకులు రావడనికి ఆయన కుటుంబం ఒక కారణమని సీఎం జోరాంతంగ ట్వీట్ చేశారు. 

1945 జూలై 21న పుట్టిన ఈయన తన 17 ఏళ్ల వయస్సులోనే తనకన్నా మూడేళ్లు పెద్దదైన తన మొదటి భార్యను పెళ్లి చేసుకున్నారు. చువాన్ థార్రన్ అని వ్యవహరించే 4 అంతస్థుల బిల్డింగ్ లోని 100 గదుల్లో ఇతని కుటుంబం నివిసిస్తోంది. ఇదే భవనంలో ఇతని కొడుకులు, వారి భార్యలు, వారి సంతానం వేర్వేరు గదుల్లో ఉంటున్నా.. కామన్ కిచెన్ మాత్రం ఒకటేనట. దీన్ని వారు షేర్ చేసుకుంటారు. ఈ కుటుంబానికి సొంత ఆదాయ వనరులు ఉన్నాయి. పైగా వీరి అభిమానులు ఇచ్చే విరాళాలు కూడా ఈ కుటుంబానికి ఆధారంగా నిలుస్తున్నయట.. ఈ అతిపెద్ద కుటుంబాన్ని ఆశ్చర్యంగా చేసేందుకు వివిధ దేశాల నుంచి టూరిస్టులు వచ్చేవారట…

Leave a Comment