మంకీపాక్స్ తో పొంచి ఉన్న ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్..!

ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచానికి మరో వైరస్ ఆందోళన కలిగిస్తోంది. అదే మంకీపాక్స్.. ఈ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరిక జారీ చేసింది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇప్పటి వరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదుకాగా, మరో 120 మందిలో లక్షణాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ సమూహ వ్యాప్తి ప్రారంభమైతే చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఈనేపథ్యంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని ఆదేశించింది. మంకీపాక్స్ పై అందరికీ అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని తెలిపింది. 

మంకీపాక్స్ లక్షణాలు ఇవే..

  • జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు 
  • అకస్మాత్తుగా దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్న మెలిగినవారు, వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆస్పత్రిలో చేరాలి. 
  • చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర వచ్చే వరకు చికిత్స తీసుకోవాలి. 

 

 

Leave a Comment