ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి..!

కరోనా సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ అంతరాయం, ఆఫీస్ వాతావరణం లేక చాలా మంది ఇబ్బందిపడ్డారు. అలాంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.. ఈ సెంటర్లను వినియోగించుకునేందుకు ఆశావహుల నుంచి అభ్యర్థలను స్వీకరిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లలో పనిచేసేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభించారు.. 

రాష్ట్ర వ్యాప్తంగా 29 చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు, విశాఖ, కాకినాడ, తిరుపతి ప్రాంతాలలో ఏపీఎస్ సెంటర్లలో 30 మంది కూర్చుని పని చేసుకునే వీలుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లను తీర్చిదిద్దారు. కంపెనీలు, ఉద్యోగుల నుంచి వచ్చి డిమాండ్ ని బట్టి త్వరలో ఈ సెంటర్లను మరిన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. భవిష్యత్ లో లక్ష మంది ఉద్యోగులు లక్షణంగా పనిచేసుకునే వీలుగా 102 సీఎం ఎక్సలెన్స్ సెంటర్లు, 500 కళాశాలలు, 20 ఇంజినీరింగ్ కాలేజీలు సహా ఏపీఐఎస్, ఏపీఐఐసీ కేంద్రాలను వర్క్ ఫ్రమ్ హోట్ టౌన్ కేంద్రాలుగా మర్చాబోతున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. 

పీజు ఎలా?

ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలలో ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.5 వేలు మాత్రమే వసూలు చేస్తారు. ఏపీలోని మిగతా పట్టణాల్లో రూ.4 వేలు చెల్లిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లలో పనిచేసుకోవచ్చు. ల్యాప్ టాప్ తీసుకుని ఈ సెంటర్లలో పనిచేసుకుని రావచ్చు.. 

ఎలా అప్లయ్ చేయాలి?

వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లలో పనిచేసుకోవాలనుకునే వారు 9988853335 నెంబర్ కి ఫోన్ చేయాలి. లేదా https://www.apit.ap.gov.in/wfht/ వెబ్ సైట్ లో కూడా తమ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు.

Leave a Comment