దళిత ప్రెసిడెంట్.. కాబట్టే కింద కూర్చోబెట్టారు..!

సాంకేతికంగా ఎంత ఎదిగిన కులం పేరుతో అగ్రవర్ణాల వారు నిమ్నవర్గాల వారిపై చెలాయిస్తున్న పెత్తనానికి అడ్డుకట్ట్ పడటం లేదు. ముఖ్యంగా దళితులు, మహిళలపై వివక్ష ఏమాత్రం తగ్గడం లేదు.. తమిళనాడులోని ఓ పంచాయతీ సమావేశంలో గ్రామ ప్రెసిడెంట్ ను కింద కూర్చోబెట్టిన వైనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసురాని గ్రామ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. 

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని తెర్ కుత్తిట్టై గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే దళిత మహిళ గత జనవరిలో పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆ గ్రామంలో 500 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో షెడ్యుల్డ్ కులానికి చెందినవి 100 కుటుంబాలు ఉన్నాయి. మిగిలిన కుటుంబాలు వన్నియార్ కులానికి చెందినవి. అయితే పంచాయతీ సమావేశాలు జరిగినప్పుడు మిగితా సభ్యులంతా కూర్చీలపై కూర్చుంటారు. రాజేశ్వరిని మాత్రం కింద కూర్చోబెట్టేవారు. గత కొన్నాళ్లుగా ఆమెపై ఈ విధంగా వివక్ష చూపేవారు. దీనికి సంబంధించిన ఫొటోలు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. 

కులం కారణంగా ఉపాధ్యక్షుడు తనను కింద కూర్చోబెట్టారని రాజేశ్వరి ఓ జాతీయా మీడియాతో తెలిపింది. జాతీయ జెండాను కూడా ఎగురవేసేందుకు అనుమతించే వారు కాదన్నారు. వాళ్ల నాన్నతోనే ఆ కార్యక్రమం పూర్తి చేయిస్తాడన్నారు. తాను పదవికి ఎంపికైనప్పటి నుంచి అగ్ర వర్ణాల పెద్దలు చెప్పినట్లు వింటున్నానని, అయినా తనను అవమానిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.   

Leave a Comment