బూతులు తిట్టాడని..ట్రాఫిక్ పోలీస్ చెంప పగల గొట్టిన మహిళ..!

అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ను కొట్టింది ఓ మహిళ..ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ ముంబైలోని కల్బదేవీ ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న మహిళను అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. 

ఆమె హెల్మెట్ ధరించకపోవడంతో వివరాలు అడిగాడు. అప్పుడు ఆ మహిళకు, ట్రాఫిక్ పోలీస్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీస్ మహిళను బూతులు తిట్టాడంటూ ఆరోపిస్తూ అతనిపై దాడి చేసింది. ఆ పోలీస్ పై చేయి చేసుకుంది. కొద్ది సేపటికి అక్కడే ఉన్న మహిళా పోలీస్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.    

 

Leave a Comment