గులాబీ రంగును పెళ్లి చేసుకున్న మహిళ..!

సాధారణంగా పెళ్లంటే.. ఒక అబ్బాయి అమ్మాయిని లేదా ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు.. కానీ ఈ మహిళ మాత్రం ఎవరిని పెళ్లి చేసుకుందో తెలిస్తే షాక్ అవుతారు.. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకున్నది ఓ రంగును.. అవును..ఇది నిజమండి బాబు.. ఆ మహిళ తనకి ఇష్టమైన రంగును పెళ్లి చేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మరీ ఈ వివరాలేంటో తెలుసుకుందామా.. 

ఆమె పేరు కిట్టెన్ కే సెరా.. ఆమె అమెరికాలోని లాస్ వెగాస్ లో నివాసముంటుంది.. సెరాకు గులాబీ రంగు అంటే చాలా ఇష్టం.. ఎంత ఇష్టమంటే పింక్ రంగుతో 40 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంది. ఆమె వేసుకునే బట్టల దగ్గరి నుంచి ప్రతిదీ పింక్ కలర్ లోనే ఉంటుంది. సెరా నిత్యం పింక్ కలర్ లోనే కనిపిస్తుంది. ఇలా కనిపించిన సెరాను ఓ చిన్న పిల్లోడు నీకు పింక్ కలర్ అంటే ఇష్టం కాదా అని అడిగాడు.. దీనికి ఆమె అవునని సమాధానం చెప్పింది. అయితే పింక్ కలర్ నే పెళ్లి చేసుకోవచ్చు కదా అని బాలుడు చెప్పాడు.. 

అంతే సెరాకు పింక్ కలర్ పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను నిజం చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న బంధువులు, స్నేహితుల సమక్షంలో పింక్ కలర్ ని పెళ్లి చేసుకుంది. విశేషం ఏమిటంటే.. ఆమె తన పెళ్లిలో ధరించిన దస్తులు, నగలు, లిప్ స్టిక్, మ్యారేజ్ రింగ్, కేక్ అన్ని పింక్ రంగులోనే ఉన్నాయి. చివరికి జుట్టుకు కూడా పింక్ కలర్ వేసుకుంది. అంతేకాదు పెళ్లికి వచ్చిన వారు కూడా పింక్ రంగు దస్తులనే ధరించారు. అంతేకాదు పెళ్లి తర్వాత వేరే వ్యక్తిని కన్నెత్తి కూడా చూడనని, జీవితాంతం గులాబీ రంగు దుస్తులు ధరిస్తానని ప్రమాణం చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Leave a Comment