ప్రపోజ్ చేసిన వెంటనే 650 అడుగుల నుంచి జారి పడింది..!

లవ్ ప్రపోజల్ అంటే ఎలా ఉండాలి? చాలా సర్ ప్రైజ్ గా ఉండాలి. ఎదుటి వ్యక్తి జీవితంలో మరిచిపోలేనిదిగా ఆ లవ్ ప్రపోజల్ ఉండాలి.. ఓ ప్రియుడు తన ప్రియురాలికి అలాంటి జ్ఞాపకమే ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆ జంటకు చేదు అనుభవం ఎదురైంది.  తన ప్రియురాలిని 650 అడుగుల ఎత్తైన కొండపై తీసుకెళ్లాడు. అక్కడ తన ప్రియురాలిని ప్రపోజ్ చేశాడు. దానికి ఆమె అంగీకరించింది కూడా..అయితే ఆమె ఓకే చెప్పిన కొద్ది క్షణాల్లోనే ఆమె కొండపై నుంచి జారి కింద పడింది. 

ఆస్ట్రేలియాకు చెందిన 27 వ్యక్తి 32 ఏళ్ల మహిళకు ప్రపోజ్ చేసేందుకు కారింథియా కొండపైకి ట్రెక్కింగ్ కు తీసుకెళ్లాడు. వారు ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కారు. ఆ తర్వాత అతను ఆ మహిళకు ప్రపోజ్ చేశాడు. ఆ మహిళ అతడి ప్రేమను అంగీకరించింది. అయితే ఆకస్మాత్తుగా కొండపై నుంచి జారి కింద పడిపోయింది. అయితే అక్కడ అంతా మంచు ఉండటంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. 

ఆమె పడిపోతున్న సమయంలో ఆ యువకుడు ఆమె చేయి పట్టుకుని పైకి లాగే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో అతడు కూడా కింద పడిపోయాడు. ఈ క్రమంలో 50 అడుగుల వద్ద అతడు ఓ కొండ అంచును సపోర్టు చేసుకుని గాల్లోనే వ్రేలాడుతూ ఉన్నాడు. దీనిని గమనించిన బాటసారులు వెంటనే అత్యవసర విభాగానికి సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని వారిని రక్షించింది. అయితే ఈ ప్రమాదంలో మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అబ్బాయి కాలు మాత్రం ఫ్యాక్చర్ అయింది.

 

Leave a Comment