ఇక ఫేస్ బుక్ ఉండదా?..అక్టోబర్ 28న ఏం జరగబోతుంది..!

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ అనే పేరు ఇక ఉండదా? అంటే అవుననే అంటోంది ప్రముఖ టెక్ బ్లాగ్ ది వెర్జ్.. అక్టోబర్ 28న జరిగే ఫేస్ బుక్ వార్షిక సమావేశంలో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ది వెర్జ్ పేర్కొంది. మోటావర్స్ వంటి భారీ ప్రాజెక్టు దిశగా  ఫేస్ బుక్ అడుగులు వేస్తున్న తరుణంలో..  పేరు మార్చడం ద్వారా రిఫ్రెష్ నెస్ ఉంటుందని జూకర్ బర్గ్ భావిస్తున్నట్లు తెలిపింది.  అయితే కొత్త పేరు ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఫేస్ బుక్ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. 

ఇటీవల ఫేస్ బుక్ దాని అనుబంధ సంస్థల్లో సర్వీస్ ప్రాబ్లమ్స్ వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ ను ఉల్లంఘించిందని ఫేస్ బుక్ కు రూ.107 కోట్ల ఫైన్ పడింది. ఫైన్ కట్టేందుకు జూకర్ బర్గ్ ఒప్పుకున్నాడు కూడా.. ప్రస్తుతం ఈ విపత్తుల నుంచి బయటపడేందుకు ఫేస్ బుక్ పేరు మారిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు ది వెర్జ్ పేర్కొంది. అయితే ఫేస్ బుక్ కొత్త పేరు ఏంటీ? ఈ మార్పును ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. 

Leave a Comment