జూమ్ మీటింగ్ సమయంలో భర్తకు ముద్దు ఇచ్చిన భార్య.. వీడియో వైరల్..!

కరోనా కారణంగా చాలా వరకు మీటింగ్ లు వర్చువల్ గా జరుగుతున్నాయి. ఈక్రమంలో జూమ్ కాల్ లో చోటుచేసుకున్న ఈ చిలిపి సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక ఎనలిస్టు జూమ్ మీటింగ్ లో దేశ జీడీపీ గురించి వివరస్తున్నాడు. 

ఆ సమయంలో ఆయన భార్య వచ్చి ఆయనకు కిస్ చేయబోయింది. ఆమె చర్యకు భర్త ఒక్కసారిగా హతాశుడయ్యాడు. వాట్ నాన్సెన్స్.. కెమెరా ఆన్ లో ఉంది అంటూ ఆమెపై కోపగించుకున్నాడు. ఈక్రమంలో ఆ మహిళ పూయించిన నవ్వులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నడి వయసులో వారిద్దరి రొమాన్స్ చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. 

Leave a Comment