మరో మహిళతో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొట్టిన భార్య..!

కట్టుకున్న భార్యను మోసం చేసి మరో మహిళతో రాసలీలలు నడుపుతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఓ భార్య.. తన బంధువులతో కలిసి ఓ ప్లాన్ ప్రకారం అతడి గుట్టును రట్టు చేసింది. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన ఖమ్మం పట్టణంలోని గుట్టయ్య సెంటర్ లో చోటుచేసుకుంది. 

ఖమ్మం పట్టణానికి చెందిన శీను ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కోర్ట్ కాలనీకి చెందిన కవితతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శీను, కవితల మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో గుట్టయ్య సెంటర్ లో భార్యకు తెలియకుండా ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 

ప్రతి రోజూ ఉదయం బయటకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి ఆ మహిళ వద్దకు వెళ్తున్నాడు. భార్యకు భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చింది. తన బంధువులతో కలిసి భర్తపై నిఘా పెట్టింది. సోమవారం తెల్లవారుజామున గట్టయ్య సెంటర్ కు భర్త వెళ్లడం చూసిన భార్య, బంధువులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తతో పాటు మహిళకు దేహశుద్ధి చేశారు. అనంతరం భర్తను, మహిళను పోలీసులకు అప్పగించారు.  

Leave a Comment