శివాలయంలో బూతు సీన్.. ట్రెండింగ్ లో బాయ్ కాట్ ‘నెట్ ఫ్లిక్స్’..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్(#boycottnetflix) అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ‘ఏ సూటబుల్ బాయ్’ అనే వెబ్ సిరీస్ లో లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా పలు బూతు సన్నివేశాలు, కథనాలను నెట్ ఫ్లిక్స్ ప్రస్తారం చేస్తుండటమే అందుకు కారణం.. ఈ వెబ్ సిరీస్ లో 19 ఏళ్ల లిటరేచర్ స్టూడెంట్ ముగ్గురు అబ్బాయిలతో రొమాన్స్ చేస్తుంది.

 అందులో ఒక ముస్లిం బాయ్ ఫ్రెండ్ తో శివాలయంలో రొమాన్స్ చేస్తున్నట్లుగా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఈ సీన్లపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో ఉన్న శివాలయంలో ఈ రొమాన్స్ సీన్స్ చిత్రీకరించారు. లవ్ జిహాద్ ని ప్రోత్సహించడమే ఒక తప్పయితే, ఆ సన్నివేశాలను హిందూ ఆలయంలో చిత్రీకరించడం మరో పాపం అని పేర్కొంటూ బీజేపీ నేత గౌరవ్ తివారి మధ్యప్రదేశ్ లోని రెవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెట్ ఫ్లిక్్ కాంటెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ తో పాటు నెట్ ఫ్లిక్స్ పబ్లిక్ పాలసీ విభాగం డైరెక్టర్ అంబికా ఖురానాలపై రెవా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సోషల్ మీడియాలో బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్(#boycottnetflix) అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. 

Leave a Comment