దశాబ్దం పాటు కరోనా ప్రభావం – WHO

కరోనా మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు మరోసారి హెచ్చరికలు జారీచేసింది. కరోనా వైరస్ కట్టడిపై డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ టీమ్ అత్యవసర సమావేశం నిర్వహించింది. కరోనా మహమ్మారి ఇప్పుడే అంతం కాదని, ఇది దశాబ్దాల పాటు ఉండనుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నమ్ పేర్కొన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ డబ్ల్యూహెచ్ఓకు కొన్ని సిఫార్సులు చేసింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేసింది. 

కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయని, వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని అధ్నామ్ వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో శాస్త్ర సాంకేతి సంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని, ఇంకా చాలా వాటికి సమాధానం దొరకాల్సి ఉందన్నారు. ఇంకా చాలా మందికి వైరస్ ముప్పు పొంచి ఉందన్నారు. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేశారు. 

తొలినాళ్లలో పెద్దగా వైరస్ ప్రభావానికి గురికాని దేశాలు సైతం ఇప్పుడు విపత్కర్ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కొన్ని దేశాలు మాత్రం వైరస్ ను బాగా కట్టడి చేయగలిగాయని అన్నారు. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కోసం 150కిపైగా సంస్థలు తీవ్రగంగా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. 2021 తొలినాళ్లలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ గతవారం పేర్కొంది. 

Leave a Comment