వచ్చే వారం చైనాకు WHO బృందం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ యొక్క మూలాలను తెలుసుకునేందుకు వచ్చేవారం చైనాకు WHO ఒక బృందాన్ని పంపనుంది. ప్రస్తుత తరుణంలో వైరస్ యొక్క మూలాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమని WHO చెబుతోంది. అసలు వైరస్ ఎలా వచ్చిందో తెలుసుకుంటే భవిష్యత్తు కోసం తామేం చేయాలో అర్థం అవుతుందని WHO డైరెక్టర్ జనగర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ అన్నారు. 

వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, టీకా లేదా చికిత్స కోసం ఎదురుచూడకుండా కాంట్రాక్ట్ ట్రేసింగ్, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతో వైరస్ ను అరికట్టగలమని చెప్పారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పది మిలియన్ల కేసులను అధికమించామని, ఒక మిలియన్ మరణాలు సంభవించాయని తెలిపారు. వ్యాక్సిన్ కనుగొనేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ ఇప్పట్లోనే అంతం కాదని, ఇంకా కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే చాలా దేశాలు దీనిపై కొంత పురోగతి సాధించాయన్నారు. 

 

Leave a Comment