ఢిల్లీ వీధుల్లో తెల్ల ‘కాకి’..వీడియో వైరల్..!

మనకు కాకి  అంటే గుర్తొచ్చేది నల్ల రంగు. ఎవరైనా నల్లగా ఉంటే కాకిలా ఉన్నావని అంటారు. కానీ తెల్ల కాకులు కూడా ఉంటాయి. అయితే తెలుపు రంగు కాకులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి అరుదైన కాకి మన దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో కనిపించింది. కావు కావు అంటూ నల్ల కాకులతో రోడ్డుపై విహరిస్తూ కెమెరాకు చిక్కింది. 

ఈ తెల్ల కాకిని అల్బినో అని పిలుస్తారు. మొదటి దీన్ని చూసిన వారు పావురం అనుకున్నారు. అయితే కావు కావు అని అరవడంతో అందరూ షాక్ అయిపోయారు. ఇంకేముంది..ఈ తెల్ల కాకిని చూసిన వారు తమ ఫోన్లు తీసి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒక కొందరైతే బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం తెల్ల కాకులు కనిపిస్తాయని చర్చించుకుంటున్నారు. 

 

Leave a Comment