వ్యక్తి వృషణాల నుంచి విజిల్స్ సౌండ్..!

ఓ వృద్ధుడికి వింత సమస్య వేధిస్తోంది.. ఆయన వృషణాల నుంచి విజిల్స్ వస్తున్నాయి. సాధారణంగా విజిల్స్ నోటితేనే వేస్తారు.. కానీ ఆయనకు మాత్రం వృషణాల నుంచి విజిల్ సౌండ్ వస్తోంది.. అమెరికాలోని ఒహియోకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు ఊపిరి పీల్చినప్పుడల్లా అతడి వృషణాల నుంచి విజిల్స్ వస్తున్నాయి. 

దీంతో ఆ వృద్ధుడు వైద్యులను సంప్రదించగా.. పరీక్షించిన వైద్యులు ‘విజిల్ స్క్రోటమ్’ ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో అతడికి వెంటనే చికిత్స అందించారు. వృషణాల నుంచి విజిల్స్ రావడానికి అతడికి నిర్వహించిన సర్జరీయే కారణమని తెలిసింది. ఐదు నెలల కింద అతడు వృషణాల వాపును తగ్గించడానికి సర్జరీ చేయించుకున్నాడు. 

ఈ సందర్భంగా వృషణాల్లో చిక్కుకున్న గాలిని తొలగించడం కోసం వృషణాలకు చిన్న రంథ్రం చేశారు. దీంతో అతడి పొత్తికడుపులో చిక్కుకున్న గాలి.. వృషణాల సంచికి ఉన్న చిన్న రంథ్రం నుంచి బయటకు రావడం మొదలైంది. దీంతో అది విజిల్స్‌‌లా వినపడటం మొదలైంది.

అయితే ఆ వృద్ధుడి శరీరంలో అవసరానికి మించిన గాలి ఉండటంతో అతడి ఊపిరితిత్తులు కుప్పకూలాయని వైద్యులు గుర్తించారు. అతడిని అలాగే వదిలేస్తే.. గుండె, ఊపిరితీత్తులు శాస్వతంగా దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉందని భావించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడటం కోసం తాజాగా మరో శస్త్రచికిత్స చేశారు.

ఆ వృద్ధుడి శరీరంలో చిక్కుకున్న అదనపు గాలిని పూర్తిగా తొలగించడం కోసం అతడి ఛాతిలోకి రెండు ప్లాస్టిక్ గొట్టాలను చొప్పించారు. అయితే, ఛాతి గోడలో గాలి చిక్కుకోవడంతో అతడి పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో మరో ట్యూబ్‌ను ఛాతిలోకి పంపి గాలిని రిలీజ్ చేశారు. 

ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి బాగానే ఉంది. అతడి ఊపిరితీత్తులు మళ్లీ పనిచేయడం మొదలుపెట్టాయి. దీంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వృషణ సంచిలో గాలి చిక్కుకునే అరుదైన పరిస్థితిని ‘న్యుమోస్క్రోటమ్’ అంటారని వైద్యులు తెలిపారు. వైద్య చరిత్రలో ఇప్పటి వరకు 60 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

 

Leave a Comment