వాస్తు ప్రకారం ఇంట్లో గడియారం ఎక్కడ ఉండాలంటే..!

హిందువులు ఎన్నో నమ్మకాలను విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం మీద ఎన్నో నమ్మకాలను పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం పై ఉన్న గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో  ఇంట్లో ఉన్న ప్రతి ఒక వస్తువును వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చి పెడుతారు. వాస్తుని అనుసరించి కొంత మంది గడియారంని పెట్టుకుంటారు.అయితే చాలామంది గడియారం వారు టైం చూసుకోవడానికి అనుకూలంగా పెట్టుకుంటారే తప్ప.వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది గడియారం పెట్టుకోరు. కానీ గడియారం తప్పనిసరిగా కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జీవితంలో సమయం చాలా ముఖ్యం. 

టైమ్‌ కరెక్టుగా ఉంటే అందరికి మంచిది. లేకపోతే అన్ని సమస్యలుగా ఉంటాయి. మంచి, చెడు సమయానికి సంబంధించినవే. అవును మీ జీవితంలో ఎలాంటి అవాంఛనీయ సమస్యలు లేదా అడ్డంకులు ఉండకూడదంటే ఇంట్లో వాస్తు ప్రకారం గడియారాన్ని ఉంచాలి. గడియారం వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో గడియారం పెట్టేటప్పుడు వాస్తు నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాస్తు ప్రకారం గడియారాన్ని కొన్ని దిశలలో ఉంచడం వల్ల జీవితంలో అన్ని రకాల కష్టాలు ఎదురవుతాయి.దక్షిణ గోడపై లేదా టేబుల్‌పై గడియారం ఉండటం వల్ల ఇంటి పెద్ద ఆరోగ్యం బాగుండదు. అదేవిధంగా గడియారాన్ని తలుపు పై ఉంచకూడదు. 

ఇలా చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వాతావరణం దెబ్బతింటుంది. మూసి లేదా విరిగిన గడియారాన్ని మరచిపోయి కూడా ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. అలాంటి గడియారాలను  ఇంట్లో పెట్టుకోకూడదు.. వాటిని ఇంటి నుండి తీసివెయ్యండి. సమయాన్ని తప్పుగా చూపే గడియారం కూడా వాస్తు దోషాలకు కారణం అవుతుంది. ఈ పరిస్థితిలో వాటిని ఇంటి నుంచి తీసివేయడమే మేలు.

వాస్తు ప్రకారం నలుపు, నీలం రంగు గడియారాలను ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే అలాంటి రంగులు ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.గడియారాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. ఎందుకంటే సానుకూల శక్తి తూర్పు, ఉత్తర దిశలలో ప్రవహిస్తుంది. అదేవిధంగా ఇంట్లో గడియారాన్ని ఉంచేటప్పుడు దాని పరిమాణంపై శ్రద్ధ వహించాలి. ఇంటి గోడపై ఉంచే గడియారం ఆకారం ఎల్లప్పుడూ గుండ్రంగా లేదా చతురస్రాకారంగా ఉండాలి. అదేవిధంగా లోలకం ఉన్న గడియారం కూడా చాలా పవిత్రమైనది. 

ఇలాంటి గడియారం ఇంట్లో అనుకులముగా ఉంటుంది మరియు పురోగతిని ఇస్తుంది. కోణాల ఆకారంతో ఉన్న గడియారాన్ని తీసివేయాలి. వాస్తుని అనుసరిస్తూ ఉన్న వారు ఇంట్లో ఏ తలుపు మీదా కూడా గడియారం పెట్టకూడదు. గడియారం కింద ప్రయాణిస్తున్న మనిషి మీద ప్రతికూల శక్తి ఉంటుంది,అని వాస్తు చెప్పేవారు అంటున్నారు. ఇంటికి వృద్ధి చెందాలి అంటే చెక్క గడియారం ఉంచడం మంచిది. అది కాకుండా మీ పనుల్లో నాణ్యతను పెరుగుతుంది.

 

Leave a Comment