గూగుల్ సెర్చ్ లో వాట్సాప్ డేటా..ప్రమాదంలో యూజర్ల భద్రత..

వాట్సాప్ తన యూజర్ల గోప్యతను ప్రమాదంలో నెట్టేస్తోంది. వాట్సాప్ అనేక ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫీచర్లతో ఉన్న ఒక బగ్ గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్ కనిపించేలా చేస్తోంది. 

వాట్సాప్ యొక్క క్లిక్ టు చాట్ ఫీచర్ లోని బగ్ సోషల్ మెసేజింగ్ సైట్ యొక్క వినియోగదారుల ఫోన్ నంబర్లను గూగుల్ సెర్చ్ ను ఇండెక్స్ చేయాడానికి అనుమతించడం ద్వారా ప్రమాదంలో పడుతోందని బగ్ బౌంటి హంటర్ అతుల్ జయరామ్ థ్రెట్ పోస్ట్ తో అన్నారు. ఇది వెబ్ లో వినియోగదారుల ఫోన్ నంబర్ల కోసం శోధించడానికి ఎవరికైనా అనుమతిస్తుంది. దీని ద్వారా వాట్సాప్ యూజర్ల భద్రత ప్రమాదంలో పడుతుంది. 

క్లిక్ టు చాట్ లో మరో వాట్సాప్ యూజర్ తో వారి ఫోన్ నంబర్లను సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ చాట్ చేసేందుకు అనుమతిస్తుంది. వెబ్ సైట్లు తమ సందర్శకులతో సంభాషించడానికి ఫోన్ నంబర్లు లేకుండానే వారితో సంప్రదింపులు జరిపేందుకు వీలు ఉంటుంది. వెబ్ సైట్ లతో కనెక్ట్ అవ్వడానికి ఈ ఫీచర్ ను ఉపయోగించే విజిటర్ల ఫోన్ నెంబర్లు గూగుల్ సెర్చ్ లో కనిపిస్తాయి. 

దీంతో స్కామర్ల చేతికి వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్ల జాబితాలు చిక్కుతాయని బగ్ బౌంటీ హంటర్ జయరామ్ చెప్పారు. వ్యక్తిగత డేటా లీక్ అయితే దాడి చేసే వారు మెసేజ్ లు పంపవచ్చు లేదా కాల్ చేయవచ్చు. వారి డేటాను స్కామర్లకు అమ్మే అవకాశం ఉందని జయరామ్ తెలిపారు.  ఈ ఫోన్ నెంబర్లతో ఎటాకర్లు యూజర్ల ప్రొఫైల్ ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. గూగుల్ సెర్చ్ లో ఫోన్ నంబర్ యూఆర్ఎల్ లపై క్లిక్ చేయడం ద్వారా వారి ఫోన్ నంబర్లతో పాటు వాట్సాప్ యూజర్ల ప్రొఫైల్ చిత్రాలను కూడా చూడవచ్చని చెప్పారు. వాట్సాప్ ప్రొఫైల్ ద్వారా ఎటాకర్లు యూజర్ యొక్క ప్రొఫైల్ ఫొటోను చూడవచ్చు. మరియు వారి ఇతర సోషల్ మీడియా ఖాతాలను కనుగొనడం ద్వారా ఆయా వ్యక్తలను టార్గెట్ చేస్తారు. అని బగ్ బౌంటి తెలిపారు. 

అయితే మే 23న బగ్ బౌంటీ ప్రొగ్రామ్ ద్వారా ఫేస్ బుక్ ను సంప్రదించగా కంపెనీ డేటా అబ్యూజ్ ప్రోగ్రాం కింద వాట్సాప్ కవర్ కాదని కంపెనీ చెప్పింది. వాట్సాప్ యూజర్లు అవాంఛిత మెసేజ్ లను ఓ బటన్ ద్వారా బ్లాక్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. 

Leave a Comment