వాట్సాప్ పేకు ఇండియాలో గ్రీన్ సిగ్నల్..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటి నుంచో మనదేశంలో నగదు చెల్లింపుల రంగంలోకి దిగాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి అనుమతులు రావడం కష్టమైంది. ఎట్టకేలకు వాట్సాప్ పే(Whatsapp payment services) మన దేశంలో అధికారికంగా లాంచ్ అవ్వడానికి జాతీయ చెల్లింపుల కార్పొరేషన్(ఎన్పీసీఐ) అనుమతి ఇచ్చింది. అయితే దశల వారీగా దీనికి అనుమతులు ఇచ్చినట్లు ఎన్పీసీఐ తెలిపింది. 

మొదట గరిష్టంగా 2 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లతో ప్రారంభించడానికి అనుమతులు లభించాయి. దీంతో త్వరలో వాట్సాప్ పే మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి వాట్సాప్ పేమెంట్స్ ను ఇండియాలో ప్రారంభించేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తుంది. కానీ రెగ్యులేటరీ సమస్యలతో పైలట్ ప్రాజెక్టు పరమితమైన యూజర్లకే ఆగిపోయింది. 

ఇప్పటికే ఇండియాలో దిగ్గజ పేమెంట్ ప్లాట్ ఫామ్స్ చాలానే ఉన్నాయి. పేటీఎం(paytm), గూగుల్ పే (Google pay), ఫోన్ పే (Phone pe), అమెజాన్ పే (Amazon pay)లు నిండి ఉన్నాయి. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఇప్పుడు వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్ ను ఇండియాలో ప్రారంభించనుంది. 

Leave a Comment