WhatsAppలో సరికొత్త స్టిక్కర్ ప్యాక్..

WhatsApp ‘Together at Home’ అనే కొత్త స్టిక్కర్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ భావాలు మరియు భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఈ కొత్త స్టిక్కర్లను రూపొందించింది. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ను భాగస్వామ్యం చేసుకుంది. 

ఈ కొత్ స్టికర్లు ప్రస్తుతం ఇంగ్లీష్ లో మాత్రమే లభిస్తాయి. త్వరలో వాటిని మరిన్ని భాషలలో దీనిని రూపొందించాలని కంపెనీ భావిస్తోంది. WhatsApp రెండు సంవత్సరాల క్రితం స్టిక్కర్లను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ యొక్క ముఖ్యమైన సాధనంగా మారింది. 

కొత్త స్టిక్కర్ ప్యాక్ ను Together at Home అని పిలుస్తారు. ప్రస్తుత సమయంలో రకరకాల మనోభావాలను వ్యక్తీకరించే స్టిక్కర్లు ఉన్నాయి. Work at Home కోసం పైజామా ధరించి ల్యాప్ టాప్ ఉన్న వ్యక్తిని చూపించే స్టిక్కర్, సామాజిక దూరాన్ని ప్రోత్సహించేందుకు ‘ఎయిర్ హై ఫైవ్’, ‘గ్రూప్ వీడియో కాలింగ్’ రూపొందించారు. ఈ ప్యాక్ లో మరిన్ని స్టక్కర్లు అందుబాటులో ఉన్నాయి. 

Leave a Comment