మీరు వాట్సాప్ గ్రూపులో ఉన్నారా…అయితే జాగ్రత్త..

ఈ జనరేషన్ లో వాట్సప్ గ్రూపులు ప్రతి ఒక్కరూ మెయింటేన్ చేస్తున్నారు. అయితే గ్రూపుల్లో మీరు పెట్టే మెసేజ్ లు రహస్యంగా ఉంటున్నాయా..దీనిపై ఓ లుక్ వేద్దాం..

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ వాట్సాప్ గ్రూపులు మెయింటేన్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఫ్యామిలీ గ్రూపులు, స్నేహితుల గ్రూపులు, ఆఫీస్ గ్రూపులు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక గ్రూపులో మెంబర్ గా ఉంటున్నారు. ఆయా గ్రూపుల్లో చాటింగ్ చేయడం, ఫొటోలు పంపించడం, ఏదైనా సమాచారం షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఏ గ్రూపు నుంచి కూడా వారు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే..ఆయా గ్రూపుల్లో మీరు పెట్టే మెసేజ్ లు సీక్రెట్ గా ఉంటున్నాయని అనుకుంటున్నారా..అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. గ్రూపుల్లో మీరు పెట్టే మెసేజన్నీ మనకు తెలియకుండానే అపరిచిత వ్యక్తులకు చేరుతున్నాయట..ఒక్క మెసేజ్ లు మాత్రమే కాదు..గ్రూపులోని సభ్యలు వివరాలు కూడా బహిర్గతమవుతున్నాయని సమాచారం. దీనికి గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లోకి చేరాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫోన్ నెంబర్ ఆధారంగా, మరొకటి లింక్ ద్వారా బయట వ్యక్తులు మనల్ని గ్రూపులోకి ఆహ్వానిస్తారు. ఇక ఈ లింక్ తోనే అసలు చిక్కు వచ్చిపడింది. అపరిచిత వ్యక్తులు ఆ లింక్ ను గూగుల్ లో సెర్చ్ చేసి వాట్సాప్ గ్రూప్ తో పాటు అందులో ఉన్న సభ్యల ఫోన్ నెంబర్లను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. 

ఇక ఆ లింక్ ను కేవలం ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఉంచినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని పరిశోధకులు నిరూపించారు. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 4,70,000 వాట్సాప్ గ్రూపుల వివరాలు గూగుల్ లో లభ్యమవుతున్నట్లు వారు వెల్లడించారు. 

వాట్సాప్ గ్రూపుల్లో ఎవరినైనా చేర్చాలంటే వారికి వ్యక్తిగతంగా మాత్రమే లింక్ ను పంపించాలని, సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దని సంస్థ అధికారి ఒకరు తెలియజేశారు…

 

Leave a Comment