‘లైగర్’ ఫ్లాప్ అయితే? విజయ్ దేవరకొండ షాకింగ్ ఆన్సర్..!

దేశంలో ఎక్కడ చూసినా లైగర్ పేరు మారుమ్రోగిపోతుంది.. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. హీరో, హీరోయిన్లుగా విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు నటిస్తున్నారు. లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది.. 

ఒకవేళ లైగర్ సినిమా ఫ్లాప్ అయితే మీరు ఎలా ఫీలవుతారు? అని విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. ఈప్రశ్నకు విజయ్ దేవరకొండ షాకింగ్ అన్సర్ ఇచ్చాడు. ‘ఈ ప్రశ్న కొన్నాళ్ల క్రితం అడిగి ఉంటే కచ్చితంగా కొప్పడే వాడ్ని.. కానీ ఇప్పుడు అలా చేయను. ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ కోసం జనాలను కలిసినప్పుడు వారి ప్రేమను తెలుసుకున్నాను. నేను ప్రేమను గుర్తుంచుకోవాలనుకుంటున్నా’.. 

‘నాకు ప్రేక్షకులు చాలా ముఖ్యం. మేము ప్రేక్షకుల కోసం పనిచేస్తాం.. వారిని కలవడం కోసం పట్టణాలకు వెళ్తాం.. మేమంతా ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవాలనుకుంటున్నాము.. ఇప్పుడు ప్రతి విషయానికి కోప్పడి నన్ను నేను తక్కువ చేసుకోను. అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. వారిని నేను అగౌరవపరచలేను.’అంటూ విజయ్ దేవరకొండ సమాధానం చెప్పాడు. 

 

 

 

 

Leave a Comment