ఢిల్లీ నిజామొద్దీన్ లో ఏం జరిగింది?

ప్రస్తుతం దేశమంతా చర్చిస్తున్న ఒకే అంశం ఢిల్లీలోని నిజామొద్దీన్ మర్కజ్. ఇక్కడ జరిగిన ఒక ముస్లిం ఆధ్యాత్మిక కార్యక్రమం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యను పెంచేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరికి కరోనా వచ్చంది. అయితే వారు ఎటువంటి పరీక్షలు చేయించుకోకుండా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడంతో వారితో దగ్గరగా మసిలిన వారికి కరోనా రావడంతో కేసలుు పెరిగాయి. 

నిజామొద్దీన్ లో ఏం జరిగింది..

ఢిల్లీలోని హజ్రత్ నిజామొద్దీన్ మర్కజ్ లో తబ్లిగీ జమాత్ అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకో సారి ఆధ్యాత్మిక సదస్సు నిర్వహిస్తారు. హజ్రత్ నిజామొద్దీన్ మసీదు మౌలానా దీనికి అధ్యక్షత వహిస్తారు. అక్కడ మత ప్రబోధకుల ప్రవచనాలు ఉంటాయి. ఈఏడాది మార్చి 13 నుంచి 15 మధ్య ఇది జరిగింది. 

ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. మత తెలుగు రాష్ట్రాల నుంచి 1500 నుంచి 2 వేల మంది హాజరై ఉంటారని అంచనా. ఈ కార్యక్రమంలో 300 మందికిపైగా విదేశీయులు పాల్గొన్నారు. వీరంతా పర్యాటక వీసాలతో వచ్చి ఈ సదస్సుకు హాజరైనట్లు గుర్తించారు. 

ఏ దేశాల నుంచి సభ్యులు వచ్చారు?

ఈ సభలో మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, నేపాల్, మయన్మార్, కిర్గిజ్ స్తాన్ మరియు సౌదీ అరేబియాకు చెందిన సభ్యలు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్, అల్జీరియా, జిబౌటి, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఫిజి, ఫ్రాన్స్ మరియు కువైట్ నుంచి కూడా సభ్యులు వచ్చారు. 

కరోనా ఎలా వ్యాపించింది?

అయితే ఈ పాటికే కరోనా అన్ని దేశాల్లో వ్యాపించింది. ఆ సదస్సుకు వచ్చిన విదేశీయుల నుంచి చాలా మందికి కరోెనా వ్యాపించింది. అయితే అప్పటికి ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. ఈ సదస్సు ముగిసిన తరువాత చాలా మంది తమ ప్రాంతాలకు వెనుదిరిగారు. అక్కడ వారు తాము విదేశాలకు వెళ్లలేదు, తాము దూరం పాటించక్కర్లేదు అన్న భావంతో మామూలుగా తిరిగిన వారి నుంచి కొందరికి కరోనా వచ్చింది. ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది. 

ఢిల్లీ నుంచి వచ్చిన వారు కొందరికి క్రమంగా శ్వస సమస్యలు మొదలయ్యాయి. వారంత ఇంట్లో వాళ్లతో కలుస్తారు. కాబట్టి, కుటుంబంలోని కొందరికి కూడా అంటుకుంది. హైదరాబాద్ లో మొదటి మరణం కేసులో కూడా ఇదే జరిగింది. వీరిలో కొందరు విదేశాలకు వెళ్లలేదు కాబట్టి, తాము క్వారంటైన్ లో ఉండక్కర్లేదని భావించారు. దీంతో ఇంట్లో వాళ్లకు వేగంగా పాకింది. అలాగని అందరూ నిర్లక్ష్యంగా లేరు. తమకు ఏ లక్షణాలు లేకపోయినా ముందే ఆస్పత్రికి వెళ్లిన వారూ ఉన్నారు. 

ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారిపైనే మొదట్లో కేంద్రీకరించిన ప్రభుత్వాలు తరువాత ఢిల్లీ నుంచి వచ్చిన వారిని కూడా ట్రేస్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ అటువంటి వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్ కి తరలించడం, పరీక్షలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. వారిలో వ్యాధి లక్షణాలు పెరుగుతుంటే ఐసోలేషన్ కి తరలిస్తున్నారు. ఒక వేళ లక్షణాలు పెరగకపోతే ఇంట్లోనే క్వారంటైన్ కి పంపిస్తున్నారు. 

ఎవరికి వారు బయటకు రావాలి..

ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారు, మతపరమైన పనికి కాకపోయిన ఆయా తేదీల్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణాలు చేసిన వారు వారిని కలిసిన వారు, కలిశామన్న అనుమానం ఉన్న వారు, వారి ఇంట్లో వాళ్లు, ఢిల్లీ నుంచి వచ్చాక వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వారు, వారితో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న వారు..వీరంతా తమను తాము మిగతా వారి నుంచి దూరంగా ఉంచుకోవాలి. తాము గతంలో ఏం చేసిందీ, ఎవరిని కలసిందీ ప్రభుత్వ సిబ్బందికి చెప్పాలి. ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలి. అప్పుడే వ్యాధి అదుపులోకి వస్తుంది. 

నిజామొద్దీన్ ఏం చెబుతోంది?

ఈ విషయమై నిజామొద్దీన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాన మంత్రి మోడీ మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించినప్పటికే ఈ సదస్సు రద్దు చేయబడిందని పేర్కొంది. తరువాత ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అకస్మాత్తుగా రైళ్లు ఆగిపోయాయి. ఈనెల 23న ఏ వాహనం దొరికితే అది ఎక్కి ప్రయాణమయ్యారు. మిగిలిన వారికి ఇక్కడ బస కల్పించక తప్పలేదు. మర్కజ్ ను ఖాళీ చేయించాలని అధికారులు 24న నోటీసులు ఇచ్చారు. వాహనాలకు పాస్ లు ఇస్తే ఖాళీ చేయించి వారి స్వస్థలాలకు పంపిస్తామని సమాధానం ఇచ్చాం. 17 వాహనాల నెంబర్లు, డ్రైవర్ల వివరాలను కూడా అందించాం. కానీ..ఇప్పటి దాక మాకు సమాధనం రాలేదని పేర్కొంది. అయితే లాక్ డౌన్ కు చాలా కాలం ముందు మత, సాంస్కృతిక, సామాజిక అన్ని సమావేశాలు నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం పిలుపునిచ్చిందని అధికారులు తెలుపుతున్నారు. 

వారికి వీసా ఇవ్వబోము..

పర్యాటక వీసాలో ఉన్న మరియు మతపరమైన కార్యక్రమానికి హాజరైన 300 మంది విదేశీయులు బ్లాక్ లిస్టింగ్ ఎదుర్కొంటున్నార. భారతదేశాన్ని సందర్శించి తబ్లిక్ జమాత్ కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరుకునే ఏ విదేశీయుడికి పర్యాటక వీసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

 

 

 

 

Leave a Comment