బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏంటీ? రాకుండా ఏం చేయాలి?..!

Tips to avoid Bird flu..

ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఫ్లూ సోకడంతో అనేక ప్రాంతాల్లో పక్షలు నేల రాలుతున్నాయి.. గిలగిలా కొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి. భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ అనిమల్ డిసిజెస్ బర్డ్ ఫ్లూపై పరీక్షలు చేస్తోంది.  

దేశంలో ఇప్పటి నాలుగు రాష్ట్రాలకు ఈ బర్డ్ ఫ్లూ పాకింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కాగా బర్ద్ ఫ్లూ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. అందుకేే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు బర్డ్ ఫ్లూ లక్షణాల ఏంటీ? ఏం చేయాలి చూద్దం..

బర్డ్ ఫ్లూని Avian Flu అని కూడా పిలుస్తారు.  H5N1 వైరస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది మనిషికి సోకితే ప్రాణాంతకం అవుతుంది. సరిగ్గా ఉడకకుండా తీసుకున్న గుడ్లు, మాంసం వల్ల ఇది సోకవచ్చు. గుడ్డులోని పచ్చ సోనా గట్టిపడే వరకు ఉడికించాలి. మాంసాన్ని 165 ఫారన్ హీట్ లేదా 74 సెంటీగ్రేడ్ ఉష్టోగ్రతలో ఉడికించాలి. 

బర్డ్ ఫ్లూ లక్షణాలు(Bird Flu Symptoms) :

  • దగ్గు
  • జ్వరం
  • గొంతు నొప్పి
  • కండరాల్లో వాపు
  • తలనొప్పి
  • ఊపిరి తీసుకోవడంలో సమస్య
  • వీటితో పాటు కళ్లు తిరగడం, విరోచనాలు, కొన్ని సందర్భాల్లో కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. 

బర్డ్ ఫ్లూ వల్ల కలిగే సమస్యలు :

  • నిమోనియా
  • కంజూక్టివిటీస్
  • ఊపిరితిత్తుల్లో సమస్య
  • కిడ్నీ సమస్యలు
  • హార్ట్ డిసీజెస్

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి :

  • పక్షుల మాంసాన్ని ఆహారంగా తీసుకోకూడదు.
  • ఓపెన్ మార్కెట్, చిన్న దుకాణాల నుంచి మాంసం కొనుగోలు చేయకండి..
  • ఇన్ఫెక్షన్ దరి చేరకుండా ఉండాలంటే తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్ అందుబాటులో ఉంచుకోండి.
  • లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. 

 

 

Leave a Comment