సీఎం జగన్ కూమార్తెలు హర్ష, వర్ష ఏం చేస్తున్నారు?

సెలబ్రిటీ పిల్లలకు నిరాడంబరమైన జీవితాన్ని గడపడం కష్టం.. అందులోనూ తండ్రి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. తాతా కూడా ఒకప్పటి ముఖ్యమంత్రి.. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు ఎంత ఆర్భాటంగా ఉంటారో తెలిసిందే.. కానీ ఏపీ సీఎం జగన్ కుమార్తెలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.. 

సీఎం జగన్, వైఎస్ భారతిల ముద్దుల కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షారెడ్డి..వీరిద్దరు ఏం చదువుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.. వారి చిన్నప్పటి ఫొటోలైతే ఇంటర్నెట్ లో లభిస్తాయి కానీ.. ఇప్పుడు వారు ఎలా ఉన్నారో ఎక్కడ వెదికినా దొరకదు.. అంతలా ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు.. కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించరు. 

అందుకు కారణం ఎంటంటే.. చదువు.. వారికి చదువంటే అంత ఇష్టం.. వారికి చదువే ప్రపంచం.. జగన్ పెద్ద కూతురు హర్షారెడ్డి ఫ్రాన్స్ లోని ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వారి యూనివర్సిటీ కాన్వొకేషన్ జులై 2న జరుగుతుంది. అందుకోసం జగన్ దంపతులు ప్యారిస్ కి వెళ్లారు.. జులై 3న విజయవాడకు తిరిగి వస్తారు. ఇక వీరి చిన్న కుమార్తె వర్షా రెడ్డి అమెరికాలోని ఇండియానాలోని నోట్రే డామ్ యూనివర్సిటీలో యూజీ చదువుతోంది.. 

జగన్ జైల్లో ఉన్నప్పుడు హర్షా, వర్షా ఇద్దరు లండన్ లో చదువుకునేవారు.. అప్పుడు కూడా వారిని ఇక్కడికి తెచ్చేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు.. జగన్ కూడా వారిని అక్కడే చదువుకోవాలని సూచించారు. తాతా, తండ్రి రాజకీయంగా ఉన్న పదవులు చేపట్టినా.. వారు మాత్రం లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు.. ఎక్కడా ఆడంబరాలకు పోరు.. కనీసం వీరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఎక్కడా కనబడవు.. వారి ప్రపంచం కేవలం చదువు మాత్రమే…

 

Leave a Comment