ఆ రాష్ట్రంలో స్పెషల్  ‘వెడ్డింగ్ కిట్’.. కొత్త జంటలకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు..!

నవ దంపతులు కుటుంబ నియంత్రణ పాటించేలా ఒడిషా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా పెళ్లయిన జంటలకు ‘వెడ్డింగ్ కిట్’ అందించనుంది. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. నవ దంపతులకు శాశ్వత లేదా తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం ఈ పథకం లక్ష్యం.. 

దీని కోసం నూతన జంటలకు వెడ్డింగ్ కిట్ ఇవ్వాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వెడ్డింగ్ కిట్ లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, ఇతర వస్తువులతో పాటు కుటుంబ నియంత్రణ పద్ధతులు, ప్రయోజనాలపై బుకల్ లెట్ ఉంటాయి. సెప్టెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇది నేషనల్ హెల్త్ మిషన్ యొక్క ‘నై పహల్ యోజన’లో ఒక భాగమని ఫ్యామిలీ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ బిజయ్ పాణిగ్రహి తెలిపారు. దీని కోసం ఆశా వర్కర్లకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  

Leave a Comment