వైరల్ అవుతున్న పెళ్లి ప్రకటన.. సోషల్ మీడియాకు బానిస కాని వధువు కావాలెను..!

పెళ్లి అంటే నూరేళ్ల పంట అని మనుకు వూహ తెలిసిన దగ్గర నుంచి అంటున్న – వింటున్న మాట.. అయితే పెళ్లికి ముందు పెళ్లి చూపులు జరుగుతాయి. అన్ని విషయాలు పూర్తిగా ఆరా తీస్తారు. ప్రస్తుతం కాలం మారుతోంది. తమకు ఎలాంటి వధువు/వరుడు కావాలో మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లో ప్రకటిస్తున్నారు. కాగా ఓ వ్యక్తి వధువు కావాలంటూ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం వైరల్ గా మారింది. పేపర్ లో వచ్చిన ఒక ప్రకటనను నితిన్ సాంగ్వాన్ అనే ఐఏఎస్ అధికారులు వధువు/వరుడు విషయంలో ఆలోచనలు మారుతున్నాయి అంటూ ట్విట్టర్ లో షేర్ చేశాడు..ఇంతకు ఆ యాడ్ లో ఏముందనుకుంటున్నారా?

‘‘పశ్చిమ బెంగాల్ కు చెందిన కమర్పూర్ కు చెందిన వ్యక్తి చటర్జీ ‘37/5’7’’ యోగా ప్రాక్టీషనర్, అందమైన, ఎటువంటి దురలవాట్లు లేని, హైకోర్టులో న్యాయవాది, పరిశోధకుడు. ఇళ్లు, కారు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పూర్ లో మరో ఇల్లు, కట్నం అడగని వరుడికి అందమైన, పొడవైన, సన్నని వధువు కావాలి. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాకు బానిస కాకూడదు.’’ అంటూ ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Leave a Comment