ఆనందయ్య మందు కోసం వెబ్ సైట్.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తే కొరియర్ ద్వారా పంపిణీ..!

కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే..త్వరలోనే ప్రజలకు మందు అందుబాటులోకి రానుంది. ఈ మందు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో తెలిస్తే వెంటనే వెళ్లి క్యూ కట్టేద్దామని చాలా మంది ఎదురుచూస్తున్నారు.. అయితే మందు పంపిణీ విషయంలో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు…

మందు కోసం ప్రజలు క్యూ కట్టడం వల్ల వారిలో ఎవరికైనా కరోనా ఉంటే ఎక్కువ మందికి వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకోసం ప్రభుత్వం ఈ మందు పంపిణీ విషయంలో తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఆనందయ్య మందు పంపిణీ చేసేలా ప్రయత్నాలు చేస్తోంది..

ఆనందయ్య మందు పంపిణీ కోసం www.childeal.in పేరుతో మందుకు సంబంధించి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెబ్ సైట్ లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆనందయ్య టీమ్ తెలిపింది. సోమవారం నుంచి ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది..

ఇక కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని కూడా మరో చోటుకు మార్చారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీకి మందు తయారీ కేంద్రాన్ని తరలించారు. కృష్ణపట్నంలో మందు తయారు చేస్తే అక్కడ ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తయారీ కేంద్రాన్ని మార్చినట్లు అధికారులు వెల్లడించారు.  

Leave a Comment