ఏపీలో మోడీయిజం స్థాపిస్తాం : సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో మోదీయిజంను స్థాపించటమే తమ పార్టీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని బీజేపీ-జనసేన సంయుక్త వ్యూహం ఖరారు చేశాయని తెలిపారు.

 వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని అన్నారు. రెండు కుటుంబ పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోందని వీర్రాజు వ్యాఖ్యానించారు.ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పరిపాలరన ఉంటుందని దుయ్యబట్టారు. అది తమిళనాడు, యూపీ, బీహార్, తెలంగాణతో పాటు ఏపీలో కూడా రుజువైందన్నారు. వీటి ప్రత్యామ్నాయ ఎజెండాను బీజేపీ అమలు చేస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

Leave a Comment