ఏపీలో ఓటర్లు 4 కోట్లు..

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4 కోట్లకు చేరింది. 4,00,02,782 మంది ఓటర్లుగా నమోదైంది. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ ఓటర్ల తొలగింవు తర్వాత రాష్ట్ర ఎన్నకల ప్రధానాధికారి కె.విజయానంద్ ఈ తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా ( డ్రాఫ్ట్ పబ్లికేషన్-23.12.2019)లో 3,98,34,776 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 1,63,030 ఓట్లు నమోదు కాగా, ఓటర్ల పరిశీలన కార్యక్రమం తర్వాత వలస వెళ్లడం, స్థానికంగా లేకపోవడం లాంటి వివిధ కారణాలతో 60,412 ఓట్లు తొలగించారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పురుష ఓటర్లు 1,96,81,827 మంది నమోదు కాగా 2020 ఎస్ఎస్ఆర్లో 1,97,90,730 మంది నమోదయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితా 2,01,48,913 మంది మహిళా ఓటర్లు నమోదవగా ఇప్పుడు వారి సంఖ్య 2,02,07,984కు పెరిగింది. డ్రాఫ్ట్ జాబితాలో 4,036 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉండగా, ఇప్పుడు 4,068 మంది నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో 7,436 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 65,388 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 45,920 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటి సంఖ్యను ఇప్పుడు 45,836కు తగ్గించారు.  అయితే రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. దాదాపు 5లక్షల మంది మహిళలు మగవారి కంటే అధికంగా ఓటర్లుగా నమోదయ్యారు. 

 

జిల్లాల వారీగా ఓటర్లు

 

శ్రీకాకుళం22,45,874
విజయనగరం18,61,812
విశాఖపట్నం36,12,431
తూర్పుగోదావరి42,54,300
పశ్చిమగోదావరి32,49,865
కృష్ణ35,85,928
గుంటూరు40,24,514
ప్రకాశం26,59,344
నెల్లూరు 24,31,967
కడప22,55,309
కర్నూలు32,84,867
అనంతపురం33,03,599
చిత్తూరు32,32,972
మొత్తం4,00,02,782

 

Leave a Comment