బాయ్ ఫ్రెండ్ కోసం కొట్టుకున్న వైజాగ్ అమ్మాయిలు..!

విశాఖ జిల్లా అనకాపల్లి బస్టాండ్ లో ఇద్దరు మైనర్ బాలికలు రచ్చరచ్చ చేశారు. అందరూ చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. వీరిద్దరు కొట్టుకున్న కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కోట్టుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

వివరాల మేరకు.. విశాఖ నగరంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఓ యువకుడిని ప్రేమించారు. ఈనేపథ్యంలో సదరు యువకుడు వేరే యువతితో మాట్లాడుతున్నప్పుడు ఒక బాలిక చూసింది. దీంతో వారిద్దరిని ఆమె నిలదీసింది. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, ఆ యువకుడు నిన్న ప్రేమించడం లేదని వేరే అమ్మాయి చెప్పింది. దీంతో ఇద్దరు అమ్మాయిల మధ్య వాగ్వాదం జరిగింది. 

ఈక్రమంలో అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో అందరూ చూస్తుండగా ఇద్దరు బాలికలు బూతులతో రెచ్చిపోయారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఒక అబ్బాయి కోసం ఇద్దరు కాలేజీ అమ్మాయిలో కొట్టుకుంటున్నారని తెలిసి అందరూ షాక్ అయ్యారు. తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అమ్మాయిలతో పాటు వారి బాయ్ ఫ్రెండ్ ని కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.  

Leave a Comment