ఆ ఊరే ఓ ఆర్మీ.. ఇంటికో జవాన్..!

అది సైనికుల గ్రామం.. దాదాపు ఇంటికొక సైనికుడు ఉంటాడు.. ఇదే ఆ గ్రామం ప్రత్యేక.. ఇంతకు ఆ గ్రామం ఎక్కడుందనుకుంటున్నారా.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా విసన్నపేట.. ఈ ఊరిలో 400 కుటుంబాలు ఉంటాయి.. ఈ గ్రామం జనాభా 1600. వీరిలో 200 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. 70 మంది రిటైర్ట్ అయ్యారు..

 సుమారు వందేళ్ల నుంచి ఈ గ్రామస్తులు సైన్యంలో పనిచేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం, చైనా, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాల్లో గ్రామ సైనికులు సేవలు అందించారు. సైన్యంలో చేరేందుకు ఈ గ్రామ యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పదో తరగతి పూర్తి కాగానే సైన్యంలో చేరుతుంటారు. తాము ఆర్మీలో పని చేసిన తర్వాత తమ పిల్లలను కూడా దేశ సేవకు అంకితం చేస్తున్నారు. రిటైర్డ్ అయ్యాక కొందరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ.. మరి కొందరు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 

గ్రామానికి చెందిన ఉప్పునూరి అచ్చిలినాయుడు, లక్ష్మీ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి నలుగురు కుమారులు. వీరంతా పదో తరగతి పూర్తి కాగానే ఒకరి తర్వాత మరొకరు సైన్యంలో చేరారు. నలుగురు అన్నదమ్ములు కూడా దేశ సేవకు అంకితమయ్యారు. వీరిలో పెద్దవాడైన శ్రీను రిటైర్డ్ కాగా.. మిగిలిన ముగ్గురు నాగేశ్వరరావు, సత్తిబాబు, పరమేష్ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. 

Leave a Comment