నవంబర్, డిసెంబర్ లోనే వైరస్ వ్యాప్తి..?

దేశంలో కరోనా వైరస్ నవంబర్, డిసెంబర్ లోనే వ్యాప్తి చెందిందా? అవుననే అంటున్నారు దేశంలో ప్రసిద్ధి గాంచిన రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన పలువురు శాస్త్రవేత్తులు.. కరోనా వైరస్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వారు వెల్లడించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమై ఒక నివేదిక ప్రకరం వూహాన్ లో గుర్తించిన కరోనా వైరస్ జాతి పూర్వ వైరస్ ఒకటి 2019 డిసెంబర్ 11 నుంచి భారతదేశంలో వ్యాప్తిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

ఎంఆర్సీఏ(మోస్ట్ రిసెంట్ కామన్ అన్సెస్టర్) అనే శాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రస్తుతం తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో వ్యాపించిన కరోనా వైరస్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 25 మధ్య కాలంలోనే ఉద్భవించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే జనవరి 30కి ముందే చైనా నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ వైరస్ ను తీసుకొచ్చినట్లు స్పష్టత లేదు. 

హైదరాబాద్ లోని సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు చెందిన అనేక జాతుల ‘మోస్ట్ రీసెంట్ కామన్ అన్సెస్టర్’ వయస్సును లెక్కించారు. దీని ఆధారంగా ప్రస్తుతం ఉన్న వాటికి భిన్నమైన మరో కొత్త జాతిని గుర్తించారు. దీనికి క్లాడ్ ఐ/ఏ3 అని పేరు పెట్టినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 

భారత దేశంలో కేరళలో మొదటి కరోనా కేసును గుర్తించారు. ఈ వైరస్..వూహాన్ లో గుర్తించబడిన వైరస్ కుటుంబానికి చెందినది. అయితే హైదరాబాద్ లో గుర్తించిన వైరస్ వూహాన్ వైరస్ భిన్నంగా ఉంది. క్లాడ్ ఐ/ఏ3 వైరస్ మూలం వూహాన్ కాదని, ఆగ్నేయాసియాలో ఎక్కడో ఉందని నిర్ధారించబడినట్లు నివేదిక తెలిపింది. ఈ వైరస్ కచ్చితంగా ఏ దేశంలో ఉద్భవించిందనే విషయం ఇంకా తెలియలేదని సీసీఎంబీ తెలిపింది. 

Leave a Comment