Viral Video: ఇది చూస్తే ఎప్పటికీ టోస్టులు తినరు.. కాళ్లతో తొక్కుతూ, నాకుతూ.. వీడు చేసే పనికి..!

చాలా మందికి ఉదయం టీతో పాటు టోస్టులు తినే అలవాటు ఉంటుంది. ఇక పిల్లలైతే ఎంతో ఇష్టంతో తింటారు. అలాంటి ఆహారంపై ఇద్దరు దుర్మార్గులు కాళ్లతో తొక్కుతూ, నాకుతూ ఆ టోస్టులను ప్యాకింగ్ చేశారు. దీనిని అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. 

ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. ఓ బ్రెడ్ ఫ్యాక్టరీలో కొందరు వర్కర్లు టోస్టులను తయారు చేస్తున్నారు. వారిలో ఇద్దరు వర్కర్లు మాత్రం నీచంగా ప్రవర్తించారు. ఆ టోస్టులను ప్యాక్ చేసేటప్పుడు వాటిని కాళ్లతో తొక్కుతూ.. నాలుకతో నాకుతూ ప్యాక్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండి పడుతున్నారు. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరైతే ఇప్పటి నుంచి మేము టోస్టులు తినమని కామెంట్ చేస్తున్నారు. 

Leave a Comment