వైరల్ వీడియో : టబ్ బాత్ చేస్తున్న పులి..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో నీటి తొట్టెలో పులి స్నానం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కర్నాటకలోని కొడుగులో ఓ ఇంటి యజమాని పశువుల కోసం నీళ్ల తొట్టి ఏర్పాటు చేశాడు. అయితే ఆ పరిసరప ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి అటువైపుగా వచ్చింది. 

నీటి తొట్టి చుట్టూ తిరుగుతూ ఎవరైనా ఉన్నారా అని పరిశీలించింది. ఆ తర్వాత నీటి తొట్టెలో దిగి జలకాలాడటం ప్రారంభించింది. అంతే కాదు ఎవరైనా వస్తే పారిపోయేందుకు సిద్ధంగా ముందు కాళ్లను రెడీగా పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజిన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.  

 

Leave a Comment