Viral Video: స్పైడర్ మ్యాన్ లా గోడపైకి పాకిన చిన్నారి..!

సాధారణంగా గోడపై పాకడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం.. స్పైడర్ మ్యాన్ సినిమాలో అయితే హీరో పెద్ద పెద్ద గోడలను అవలీలగా ఎక్కేస్తుంటాడు. కానీ నిజజీవితంలో ఎలాంటి ఆధారం లేకుండా గోడ ఎక్కడం అసాధ్యం.. అయితే ఈ చిన్నారికి మాత్రం అది సాధ్యమంది. ఎలాంటి ఆధారం లేకుండా గోడను స్పైడర్ మ్యాన్ లా ఎక్కిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐదేళ్ల చిన్నారి ఇంట్లోని రెండు గోడల మధ్య ఒక్కో కాలు పెట్టి స్పైడర్ మ్యాన్ లా పైకి పాకింది. కేవలం ఒక్క నిమిషంలో ఇంటి పైకప్పు వరకు చేరింది. అక్కడ కాళ్లును, చేతులను ఆడిస్తూ విన్యాసాలు చేసింది. సీలింగ్ కు ముద్దు పెట్టి.. కొద్ది దూరం నెమ్మదిగా కిందికి పాకింది. తర్వాత ఏమాత్రం భయం లేకుండా నేలపైకి దూకేసింది. ‘స్పైడర్ గర్ల్’ అన్న క్యాప్షన్ తో ఈ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వేల లైకులతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.  

Leave a Comment