ఫేస్ బుక్ పోస్టుపై బెంగళూరులో హింసా..!

ఓ వివాదాస్పద ఫేస్ బుక్ పోస్టు బెంగళూరులో హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి కారణమైంది. ఈ అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పోలీసులు ఇప్పటివరకు 110 మందిని అరెస్టు చేశారు. బెంగళూరులోని డిజె హల్లి మరియు కెజి హల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ హించ జరిగింది.  

కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్ట్ షేర్ చేశాడు. దీనికి కారణం ఎమ్మెల్యేనే అని కొంత మంది భావించారు. మంగళవారం రాత్రి కావల్ బైరసంద్రలోని ఎమ్యెల్యే ఇంటిపై నిరసన కారులు దాడి చేశారు. నిరసన కారులు అక్కడున్న వాహనాలకు నిప్పంటించారు. ఎమ్యెల్యే ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అల్లరిమూక ఫైర్ సిబ్బందిని కూడా అడ్డుకుంది. 

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి రాక మరింత హింసాత్మకంగా మారింది. అల్లరిమూక పోలీసు వాహనాలకు నిప్పుపెట్టింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో సంబంధం ఉన్న 110 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు బెంగళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. వివాదాస్పద పోస్టుతో ఈ హింసకు కారణమైన నవీన్ కు కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.  

Leave a Comment