ఎప్పుడు వర్షం పడని గ్రామం.. ఎక్కడుందో మీకు తెలుసా?

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. అలాంటి వింతలను విన్నప్పుడు ఆశ్చర్యానికి గురవుతుంటాము.. ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే గ్రామం ఏదంటే మేఘాలయాలోని మాసిన్నామ్ అని ఇట్టే చెప్పేస్తాం.. కాని ప్రపంచంలో ఎప్పుడు వర్షం పడని గ్రామం ఏదంటే?.. అసలు ఉందా అనే ఆలోచన వస్తుంది.. 

అయితే ఓ వింత గ్రామం వర్షం పడని గ్రామంగా పేరు తెచ్చుకుంది. అది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. ఈ వింత గ్రామం పేరు ‘ఆల్ హుతైబ్’.. ఇది ఎప్పుడూ వర్షాలు పడని ప్రపంచంలో ఎకైక గ్రామం. ఎందుకంటే ఈ గ్రామం మేఘాలపైన ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. 

వర్షం కురవని ఈ గ్రామానికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. శీతాకాలంలో ఈ ప్రాంతంలో ఉదయం సమయంలో వాతావరణం చల్లగా ఉన్నా.. సూర్యుడు ఉదయించిన తర్వాత వాతావరణం వేడిగా ఉంటుంది. ఈ గ్రామంలో పురాతన నిర్మాణాలతో పాటు ఆధునిక నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామం మేగాల కంటే పైన ఉండటం వల్ల ఈ గ్రామంలో ఎప్పటికీ వర్షం పడదు. అయితే ఈ గ్రామంపై నుంచి కిందన వర్షాలు పడటాన్ని మాత్రం చూడవచ్చు. 

Leave a Comment