శ్రీచైతన్య కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాలితో తన్నిన లెక్చరర్..!

విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని లెక్చరర్ చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నాడు. తరగతి గదిలో మాట్లాడినందుకు విద్యార్థికి ఆ లెక్చరర్ వేసిన శిక్ష ఇది.. దీనికి సంబంధించిన వీడగియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బెంజిసర్కిల్ సమీపంలోని శ్రీచైతన్య కాలేజీలో తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యార్థిని లెక్చరర్ విచక్షణా రహితంగా కొట్టాడు. చెంపలు వాయించడంతో పాటు ఎగిరెగిరి కాలితో తన్నాడు. దృశ్యాలను వెనుక బెంచిలో కూర్చున్న విద్యార్థులు రికార్డ్ చేసి షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు చైల్డ్ లైన్ వారు రంగంలో దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతాయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖధికారి రేణుక కాలేజీకి వెళ్లి విచారణ చేశారు. విద్యార్థి ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో కోపంలో కొట్టానని లెక్చరర్ చెప్పాడు. అయితే తమ అబ్బాయి వద్ద ఫోన్ లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. లెక్చరర్ ని కాలేజీ యాజమాన్యం తొలగించింది. 

 

Leave a Comment